నేటి నుంచే సూపర్‌-12మ్యాచ్‌లు ప్రారంభం.. .. ఇవాళ్టి మ్యాచ్‌ లు ఇవే

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మెగా సమరం. ఇవాళ్టి నుంచే సూపర్‌ – 12 మ్యాచ్‌ లు ప్రారంభం కానున్నాయి. సూపర్‌ – 12 మ్యాచ్‌ ల నేపథ్యం లో అన్ని ఏర్పాట్లను చేసింది ఐసీసీ. కరోనా నియమ నిబంధనలతో ఈ మ్యాచ్‌ లను నిర్వహిస్తోంది ఐసీసీ. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ ల విషయానికి వస్తే… ఇవాళ మొదటి మ్యాచ్‌ ఆస్ట్రేలియా మరియు దక్షిణా ఫ్రికా జట్ల మధ్య జరుగనుంది.

ఇక ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం… 3.30 గంటలకు ప్రారంభం కానుండగా… అబుదాబి లోని షేక్ జాయెద్ స్టేడియం లో ఈ మ్యాచ్‌ జరుగనుంది. అలాగే.. ఇవాళ్టి రెండో మ్యాచ్‌ వెస్టిండిస్‌ మరియు ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా… దుబాయ్‌ లోని ఇంటర్నేషనల్‌ స్టేడియం లో జరుగనుంది. ఇక ఇవాళ రెండు మ్యాచ్‌ లు ఉండటంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు. ఇక అటు రేపు పాక్‌ మరియు ఇండియాల మధ్య పోరు జరుగనుంది.