తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కు సంబంధించి ఎన్నికల కమీషన్ ఇప్పటి కే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తెలంగాణ లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 12 స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో మంచి అభ్యర్థుల వేటలో అధికార టీఆర్ఎస్ పార్టీ పడింది. అందులో భాగంగా ఒక జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెగ ప్రచారం సాగుతుంది.
ప్రస్తుతం సిద్ధిపేట్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామి రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యార్థి అని ప్రచారం సాగుతుంది. వెంకట్రామి రెడ్డి కొన్ని సార్లు అధికార పార్టీ కి మద్ధత్తు గా మాట్లాడి పలు సార్లు వార్త లలో కి ఎక్కారు. ముఖ్యం గా ఒక కార్య క్రమంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కాళ్లు ను పాదాభివందనం చేసాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంకట్రామి రెడ్డి పేరు వినిపించింది. అలాగే ఇటీవల వరి విత్తనాల అమ్మకం విషయం లో కూడా వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశాడు.
అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి లో పడ్డాడు. అయితే వెంకట్రామి రెడ్డి కూడా ఎమ్మెల్సీ టీకెటు ఇవ్వడానికి గులాబీ బ ఆస్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. టికెట్ వస్తే తప్పకుండా ఎమ్మెల్సీ గా పోటీ చేస్తానని వెంకట్రామి రెడ్డి అంటున్నారని సమాచారం.