ఎమోషనల్ అవుతూ.. కమెడియన్ వేణు పోస్ట్..!

-

జబర్దస్త్ తో పాపులారిటీని తెచ్చుకున్న చాలా మంది కమెడియన్లలో వేణు కూడా ఒకరు ఆయన కామెడీ పంచులతో టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్గా కూడా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో వేణు బలగం అనే సినిమాని తెరమీదకి తీసుకువచ్చాడు ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ సుధాకర్ రెడ్డి తదితరులు సినిమాలో నటించారు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద సక్సెస్ ని అందుకుంది. 23 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది.

ఈ మూవీలో ఉన్న బంధాలు భావోద్వేగాలు ప్రతి మనిషి అర్థం చేసుకోవాలని సినిమా పల్లెటూరులో తెరలు కట్టి మరీ ప్రదర్శించారు. బలగం సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కమెడియన్ వేణు పోస్ట్ చేశారు మీ అందరికీ ఒకసారి మళ్లీ కృతజ్ఞతలు అని సపోర్ట్ చేసినందుకు ఆశీర్వదించినందుకు అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. వేణు కి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news