హాస్యభరితాలు.. ఈ వన్యప్రాణుల విన్యాసాలు

-

వన్యప్రాణుల చిలిపి చేష్టలు కూడా మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ ఆ విన్యాసాలు చూడాలంటే మాత్రం అరణ్యమార్గం పట్టాల్సిందే. అయితే వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ల కెమెరా కంటికి చిక్కిన వాటి ద్వారా కూడా ఆ ఆనందం పొందొచ్చు.

‘ది కామెడీ వైల్డ్‌ లైఫ్‌’  అనే సంస్థ ప్రతి ఏడాది వన్యప్రాణుల కామెడీ ఫోటోల పోటీలు నిర్వహిస్తుంది. విజేతలకు అవార్డులు, రివార్డులు కూడా ఉంటాయి. సాధారణంగా వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్లు సీరియస్‌ ఫోటోల కోసమే వేచి చూస్తుంటారు. అప్పుడప్సుడు మాత్రం ఇలాంటి చిత్రాలు చోటు చేసుకుంటాయి. ఇవి కావాలని తీసినవి కావు. అకస్మాత్తుగా జరిగిపోయే కొన్ని చిలిపి సన్నివేశాలు. కరెక్ట్‌గా అదే టైమ్‌కి క్లిక్‌మంటే ఓ అద్భుతమైన ఫోటో బయటకు వస్తుంది. ఎంతగానో నవ్వించే ఈ చిత్రాల పోటీలో 2019 విజేతలు, వారు తీసిన ఫోటోలను మీరూ ఒకసారి పరికించండి.. నవ్వకుండా ఉండలేరు..

      1. సారా స్కిన్నర్‌ – ప్రథమ బహుమతి. తండ్రి సింహం వెనకాల ఆడుకుంటున్న పిల్లకు ‘ఏదో’ కనబడింది. దాన్ని అందుకునే ప్రయత్నం…. తర్వాత ఏం జరిగుంటుందో మీరే ఊహించుకోండి.

    2. వ్లాదో పిర్సా – ద్వితీయ బహుమతి. ‘‘మగడి పరిస్థితి ఎక్కడైనా ఒకటేనన్నమాట.’’

     

    3. హారీ వాకర్‌ – ఒలింపస్‌ క్రీచర్స్‌ అండర్‌ ది వాటర్‌, పీపుల్స్‌ చాయిస్‌ అవార్డ్‌. ‘‘ఓ మై గాడ్‌… ఏం జరుగుతోంది?’’

     

    4. ఎలైన్ క్రూర్‌ – అమేజింగ్‌ ఇంటర్‌నెట్‌ పోర్ట్‌ఫోలియో అవార్డ్‌ – ’’ముందు ప్రేమ – తర్వాత పెళ్లి’’

    5. గీర్ట్‌ వెగెన్‌ – ‘‘ మీకు శుభాకాంక్షలు’’

    6. టామ్‌ మంగెల్సన్‌ – ‘ ఢీ అంటే ఢీ’’

    7. మైక్‌ రోవ్‌ – ‘‘ నన్ను కనుక్కోండి చూద్దాం..!’’

    8. టామ్‌ మంగెల్సన్‌ – ‘‘సరిలేరు నీకెవ్వరు’’

    9. మార్టినా గెబర్ట్‌ – ‘‘ నా డ్యాన్స్‌ ఎలా ఉంది?’’

    10. ఎల్మర్‌ వీస్‌ – ‘‘ వరల్డ్‌ సర్ఫింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాను.’’

    11. జెమా గార్షియా – ‘‘ ఇప్పుడేం చేద్దాం.?’’

Read more RELATED
Recommended to you

Exit mobile version