ఏపీ ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. కరెంట్ కోతలు ఉన్న నేపథ్యంలో మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగానే రేపు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.
ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్..
గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాద లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.