రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో టిడిపి జోరు మీద ఉంది రానున్న ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా అడుగులు వేస్తోంది టీడీపీ అధిష్టానం ప్రజల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను బహిరంగ సభలని నిర్వహిస్తోంది టీడీపీ. ఈరోజు హిందూపురం నియోజకవర్గం లో టిడిపి శంఖారావం బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా దీనిలో పాల్గొన్నారు వైసిపి పాలనలో నష్టపోయింది బడుగు బలహీన వర్గాలు అని అన్నారు. వైసిపి దురాగతాలకి ప్రజా కోర్టు లో శిక్ష పడే సమయం వచ్చిందన్నారు దోచుకో పంచుకో తిను పేటెంట్ జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు దోపిడిని ఎదుటి వాళ్ళకి అంటగట్టి అబద్ధాలు చెప్పడమే జగన్ నైజం అని మండిపడ్డారు.