కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డని పరిశీలించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు భారీ దగ్గరికి చేరుకున్నారు. సీనియర్ అధికారి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం లో ఐదు మంది ఎన్ డి ఎస్ ఏ బృందం మేడిగడ్డని పరిశీలిస్తున్నారు. మేడిగడ్డలోని 18 19 20 21 పిల్లర్లని వీటితో పాటు పగుళ్ళని పరిశీలించారు. గేట్ల సామర్థ్యం మీద అధ్యయనం చేయబోతున్నారు.
వీటి ద్వారా అన్నారం సుందిళ్ల బ్యారేజీ లని కూడా పరిశీలించి ఆ తర్వాత జల సౌదా అధికారులతో భేటీ అయ్యి చర్చించబోతున్నారు పరిశీలన తర్వాత నివేదికని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నివేదిక సమర్పించడానికి కమిటీ కి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల సమయం విధించింది కాలేశ్వరం లో భాగంగా నిర్మించిన మూడు ప్రాజెక్ట్లలో లోపాలు బయటపడటం ప్రాజెక్టు సేఫ్టీని పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.