యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్…!

-

నేటి కాలంలో ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ లో ఏకంగా రూపాయలు 15 లక్షలు కోల్పోవడంతో బీటెక్ స్టూడెంట్ మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మధుకర్ ఆన్లైన్ గేమ్స్ కి బానిసయ్యాడు. నిత్యం ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. చివరికి రూపాయలు 15 లక్షలు కోల్పోయాడు. అయితే బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న మధుకర్ తల్లిదండ్రులుని అప్పుల పాలు చేశానన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

committed suicide
committed suicide

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మొదల కి చెందిన తోట మధుకర్ హైదరాబాద్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే తాను కొంత కాలంగా డఫ్పా బెట్‌ గేమ్ ఆడుతూ బానిసయ్యాడు. తన బంధువుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు అప్పు చేసి చివరికి రూపాయలు 15 లక్షల వరకు డఫ్పా బెట్‌ లో కోల్పోయాడు.

తన తండ్రికి ఈ విషయం తెలిసి అప్పులు కూడా తీర్చేసాడు. కానీ తన తీరుతో తల్లిదండ్రులుకి భారంగా ఉంటుందేమో అని తీవ్రంగా బాధ పడ్డాడు అయితే ఏడో తారీఖు ఉదయం తన తండ్రి ఏటిఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకు రమ్మని చెప్పాడు.

బయటకు వెళ్లిన తర్వాత ఇక తిరిగి రాలేదు ఆ రోజు మధ్యాహ్నం దండేపల్లి మండలం చింతపల్లి గ్రామం లో ఉండే తన అక్కకి తాను మంచిర్యాలలో పురుగుల మందు తాగినట్లు మెసేజ్ చేశాడు వాళ్ళ అక్క తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వెతుక్కుంటూ వెళ్లారు. ఆచూకీ కనిపెట్టి కరీంనగర్ హాస్పటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ మధుకర్ శనివారం సాయంత్రం చనిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news