కరోనా గండం: ఐటీ ఉద్యోగులకి కరోనా చెక్…!

-

కరోనా మహమ్మారి ప్రజలందరినీ అనేక ఇబ్బందులు పెడుతోంది. ఎంతో మంది ఉద్యోగాలు లేక సతమతమవుతున్నారు. ఈ కారణం వల్ల ప్రతి ఒక్కరికి కూడా తీవ్ర నష్టం వచ్చిందనే చెప్పాలి. అయితే దీపక్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి లక్షలు జీతం, ఉండడానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అంతే కాకుండా వెళ్లడానికి కారు అంతా సవ్యంగా  సాగుతున్నాయనే సమయానికి కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. జీతం ఉందో లేదో తెలియక పోయినా పర్వాలేదు. కానీ ఉద్యోగం ఉంటుందా అనే ప్రశ్న నిజంగా భయాందోళనకు తీసుకొచ్చింది. కేవలం ఈ పరిస్థితి దీపక్ ఒక్కడిది మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు.

job loss
job loss

అయితే ఆటోమేషన్ కారణంగా రెండేళ్ల నుంచి క్రమంగా ఉద్యోగాలను తగ్గించుకుంటూ వస్తున్నాయి ఐటి కంపెనీలు. దీనితో ఈ వైరస్ మరింత ఇబ్బందులకు నెట్టింది. ఆ సంస్థలు కూడా ఏమీ చేయలేక ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రాజెక్టు ఆగిపోవడంతో ఆయా సంస్థలు వేలాది మంది సిబ్బందిని తగ్గించుకునే పనిలో ఉన్నారు. అయితే దీనితో ఏకంగా ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ లు రెండు వేల మందిని తొలగించనున్నారు అని ప్రకటించింది.

అయితే దేశీయ సిబ్బందిపై ఈ మేర ప్రభావం పడుతుందని సంస్థ స్పష్టత ఇవ్వ లేనప్పటికీ వందలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 3.50 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా భారత్ నుండి మూడోవంతు సేవలందిస్తున్నారు. అయితే సిబ్బంది తొలగింపు పై ఐబీఎం వర్గాలు స్పందించడానికి నిరాకరించారు. అయితే వేలాది మందిని తొలగించినట్లు నాస్‌డాక్‌లో లిైస్టెన కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రకటించింది భారత్ లో రెండు లక్షల మంది సిబ్బంది ఈ కాగ్నిజెంట్ లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2.90 లక్షల ఉద్యోగులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news