విలయతాండవం చేస్తున్న కరోనా పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. మరీ ముఖ్యంగా ఆహారంలో తప్పక జాగ్రత్తలు పాటించాలి. బలవర్ధకమైన తిండి తింటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇప్పుడు అసలే వాన కాలం మొదలైంది. కాబట్టి రోగాలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ మన శరీరం తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. రోగ నిరోధక శక్తి బాగా ఉంటే అది మనకు రక్షణ కవచంలా పని చేస్తుంది కనుక ఈ రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవాలంటే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి నిత్యం మనకి అందుబాటులో ఉండే పాలు పండ్లు పప్పులు కూరగాయలు గుడ్లు వంటివి ఆహారంలో చేర్చాలి.
కాబట్టి వీలైనంత వరకూ మంచి ఆహారాన్ని పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అసలే ఈ కరోనా వైరస్ కి మందు లేదు అని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో అజాగ్రత్తగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఒంట్లో శక్తి లేకపోతే ప్రాణానికే ముప్పు కలుగుతుంది. ఇలాంటి మహమ్మారిని తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం కాబట్టి దానిని కనుక మనం పెంచాలంటే సమతుల ఆహారం తోనే సాధ్యం.
ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండగలరు. అంజీర ఔషధ ఫలం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడి తగ్గించడం మాత్రమే కాకుండా శరీరం పుష్టిగా ఉండేలా చూస్తుంది. దీనిలో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ తో పాటు పీచు పదార్థం కూడా ఉంటుంది. మధుమేహం కూడా తగ్గిస్తుంది గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఇది నివారించడానికి సహాయపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది ఎన్నో లాభాలు అంజీర లో ఉన్నాయి. కాబట్టి అంజీరానీ మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి.
అలానే దానిమ్మ పండు రక్తహీనత దూరం చేస్తుంది. అంతేకాకుండా దీనిలో ఫైబర్ తో పాటు పొటాషియం ఫాస్పరస్ మెగ్నీషియం కాల్షియం కూడా ఉంటాయి. వీటితో పాటు బి1 బి2 విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దానిని కూడా తీసుకోండి. అలానే డ్రైఫ్రూట్స్ శక్తినిస్తాయి అల్లనేరేడు కూడా ఔషధంగా పని చేస్తుంది. రోజుకు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని తీసుకుని ఆరోగ్యాంగా ఉండండి.