ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లుగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. మొత్తం 3,441 మంది నుంచి అప్లికేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వారిలో 2,569 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లుగా వెల్లడించారు.
Compassionate appointments for 2569 people in APఇదిలా ఉండగా…. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు న్యాయం చేకూరే విధంగా తగిన చర్యలు చేపడుతున్నారు. కాగా, డీఎస్సీ పరీక్షలలో అర్హత సాధించిన వారికి త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నారు. కాగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది. కార్యక్రమాన్ని తొందరలోనే ప్రారంభించనున్నారు.