మంచు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు లకు ఊహించని షాక్ తగిలింది. మంచు మోహన్ బాబు, విష్ణువు లపై నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తాజాగా హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ఇటీవల మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను పై వారు దొంగతనం కేసు పెట్టడం.. అనంతరం నాగ శ్రీను ఓ వీడియో విడుదల చేస్తూ మోహన్ బాబు కుటుంబం తనను చిత్ర హింసలకు గురి చేసిందని.. కులం పేరుతో దుర్భాషలడరని అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే…. మెగా బ్రదర్ నాగబాబు..నాగ శ్రీను కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందించారు. అయితే తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు లపై నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బిసి కులాల్లో అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ కులాన్ని మోహన్ బాబు, విష్ణు నీచంగా కించపరచారని… వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కమీషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై త్వరలోనే హెచ్ఆర్సి స్పందించింది.