కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా…అయితే ఈ సమస్యలు తప్పవుగా

-

ఈ రోజుల్లో అన్నం వండేందుకు కుక్కర్ వాడని గృహిణీ అంటూ లేదమో కదా..రెండు కప్పులు రైస్ తీసుకోవండ కడిగి కుక్కర్లో వేయటం.. గ్యాస్ మీద ఏదో ఒక కర్రీ చేయడం..అంతే వంట అయిపోతుంది. వంటగదిలో ఎలక్ట్రిక్ సామన్లదే హవా. అయితే కరెంట్ కుక్కర్లో వండిన అఎన్న ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు కారణం ఏంటి, తినటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..ఈరోజుల్లో మనకు తెలియకుండానే ఎన్నో రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి..వాటికి కారణం..మనం చేసే చిన్న చిన్న తప్పులే.
రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏదైనా ఆహారం చేసేప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. ఆలా లేకపోతే అది హానికరంగా మారుతుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఉపయోగాలు ఉండకపోగా.. అల్యూమినియం, ఇతర అనారోగ్య కారకాలు శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది.
ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటేన..
కీళ్ల వాతం
మధుమేహం
గ్యాస్ సమస్యలు
అధిక బరువు
నడుము నొప్పి
ఉదర సంబంద సమస్యలు
గుండె సంబందిత సమస్యలు
అల్యూమినియం పాత్రలు తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి, లేదా యాసిడ్ కలిగిన పదార్ధాలను నిల్వ ఉంచొద్దు. అలాగే ఈ పాత్రల్లో ఫ్రై లాంటి వంటలు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యూర్ అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్‌తో తయారు చేసిన పాత్రలు వాడితే అది వంటల్లో కలిసే ప్రమాదం అంతగా ఉండదని పరిశోధకులు అంటున్నారు.
కాబట్టి డైలీ కుక్కర్లోనే రైస్ చేసే వాళ్లు ఓ సారి ఆలోచించండి.. ప్రత్యామ్యాయం ఆలోచించండి. టైం లేనప్పుడు అంటే సరే చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా కుక్కర్లోనే రైస్ పెట్టేసి చేతులు దులుపుకోకుండా..గ్యాస్ పైన వండేందుకు ప్రయత్నించండి. ఇప్పుడు కుక్కర్ వాడకం ఎంతలా పెరిగిందంటే..మనకు గ్యాస్ మీద వండిన అన్నం కూడా తినాలనిపించదు. కుక్కర్లో ఉన్నంత సాఫ్ట్గా రైస్ రాదు.. గ్యాస్ పై వండిన అన్నం లావుగా వస్తుందని చాలా మంది తినటానికి ఇష్టపడటం లేదు కూడా. వారానికి రెండు మూడు రోజులు కుక్కర్లో చేసుకున్నా..మిగిలిన రోజుల్లో ప్రత్యామ్మాయాన్ని ఎంచుకోమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news