కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లపై హైకోర్టు న్యాయమూర్తి రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని.న్యాయవాది రామారావు ఆరోపించారు.
కాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు దర్యాప్తు చేయనుంది.అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్వి ఆందోళన చేపట్టింది.ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్వి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు.ఓయూలో రాహుల్ గాంధీ అడుగు పెడితే అడ్డుకుంటామని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతే రాహుల్ ఓయూకి రావాలని డిమాండ్ చేశారు.