కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు

-

మద్యం ప్రియులు బ్రాండ్ విషయంలో ఏమాత్రం రాజీ పడరనే విషయం అందరికీ తెలిసిందే. కొట్టులో ఏదైనా బ్రాండ్ వస్తువులు లేకపోతే వేరే వాటితో రాజీ పడతారేమో కానీ.. ఇష్టమైన బ్రాండ్ మద్యం లేకపోతే అసలు రాజీపడరు మనోళ్ళు. అయితే ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం చాలా కామన్. కానీ జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదని ఏకంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు.

 

జగిత్యాలకు చెందిన ఈ కింగ్ ఫిషర్ లవర్ ఆ బ్రాండ్ అమ్మకాల కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం సంచలనంగా మారింది. జగిత్యాల పట్టణంలోని వైన్స్ షాపులు సిండికేట్ అయ్యి కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో కలెక్టర్ బిఎస్ లతకు ఫిర్యాదు చేశాడు. ఇది హాస్యాస్పదమే అయినప్పటికీ.. రోజువారి మద్యం తాగే వారికి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వస్తుంది. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి మండలాలలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారని.. కానీ జగిత్యాలలో మాత్రం అమ్మట్లేదని లేఖలో పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news