టీడీపీలో ప్ర‌జాక‌ర్ష‌ణ నేత‌లు ఏరి…!

-

టీడీపీలో ప్రజాకర్షణ ఉన్న నేతల లేకపోవడం బాబు తప్పేనా ? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. చంద్రబాబు తర్వాత ఆ పార్టీలో ప్రజాకర్షణ ఉండే నేత ఎవరు అనే ప్రశ్న ఎప్పటి నుంచో వినపడుతుంది. రాజకీయంగా ఆ పార్టీ ఎన్నో సంచనాలు సృష్టించింది. దానికి ఎన్టీఆర్, చంద్రబాబు ఛరిష్మానే కారణం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీడీపీని అన్ని రకాలుగాను ముందు ఉండి నడిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు.

ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా పార్టీలో, ఒకరకమైన పోరు కనపడకుండా నడిచేది, చంద్రబాబుకి దగ్గుబాటి మధ్య యుద్ధం ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీ పగ్గాలు నాటకీయ పరిణామాల మధ్య అందుకున్నారు. ఇన్నాళ్లు పార్టీలో ప్రజాకర్షణ ఉండే నేతలు కొందరు ఇప్పుడు వృద్ధులు అయ్యారు. వారి రాజకీయానికి కాలం చెల్లింది. ఇప్పుడు పార్టీలో రామ్మోహన్ నాయుడు మినహా ఎటు చూసినా సరే ప్రజలను ఆకట్టుకునే నేత మాత్రం కనపడటం లేదు అనేది వాస్తవం.

చంద్రబాబు ప్రసంగాలు ఒకప్పుడు పార్టీకి జవసత్వాలు నింపాయి. ఇప్పుడు ఆయన ప్రసంగాలు కూడా అంత ఆసక్తిగా ఉండటం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, సహా కొందరు ఆకర్షణ ఉన్న నేతలు పార్టీకి దూరం జరుగుతూ వచ్చారు. తనకు వయసు మీద పడుతున్నా సరే చంద్రబాబు మాత్రం తన తర్వాత ఎవరు ? అనే విషయంలో ఆలోచించడం లేదు. చంద్రబాబులో కూడా అభద్రతా భావం ఎక్కువ‌న్న‌ది ముందు నుంచి ఉంది.

ఇప్పుడు కూడా అన్నీ తానై వ్యవహరించాలి అనుకుంటున్న‌ట్టే ఉంది. దీనికి తోడు ఎంత వ‌ర‌కు బాబు త‌న కుమారుడు లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వాలి… త‌న‌ను సీఎం చేయాల‌నే చూస్తున్నారే త‌ప్పా… పార్టీలో ఇత‌ర నాయ‌క‌త్వాన్ని ఎంక‌రేజ్ చేస్తూ.. యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌నే దానిపై దృష్టి పెట్ట‌డం లేదు. అలా అనుకునే చాలా మందిని ఆయన దూరం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ తరహా పరిస్థితులు ఎక్కడ వస్తాయో అని భావించి ముందే కొందరిని పక్కన పెట్టారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది ఆయన శైలి ఇప్పుడు అయినా మారకపోతే మాత్రం పార్టీకి ఇబ్బందే.

Read more RELATED
Recommended to you

Latest news