తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం: సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

-

ఏపీ మరియు తెలంగాణ  రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం పై సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలని.. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య కలహాలు వద్దని ఆయన పేర్కొన్నారు.

మూడో పక్షం జోక్యం అవాంఛనీయమని స్పష్టం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలచులేదని వెల్లడించారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడినని గుర్తు చేశారు ఎన్వీ రమణ.

తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్దపడినట్లైతే సమాఖ్యస్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాద పరిష్కారానికి తోడ్పాటు అవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కేసు విచారణను మరోక ధర్మాసనానికి బదిలీ అవుతుందన్నారు. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తాను ఈ విషయాన్ని చేపడతానని స్పష్టం చేశారు సీజేఐ ఎన్వీ రమణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version