మీ అత్తగారితో గొడవలా..?? అయితే ఇలా చేయండి.. !

-

మీ వివాహ దాంపత్యంలో మీ అత్తమామల ఒత్తిడి ఎక్కువగా ఉందా..? అత్తమామలతో సర్దుకుపోలేకపోతున్నారా..? మాటి మాటికీ ఇంట్లో కలహాలు వస్తున్నాయా..? ఈ గొడవల కారణంగా మానసికంగా చింతిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే.. ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకుని చదవండి.

పెళ్ళికాకముందు వరకు ప్రతి స్త్రీ పుటింట్లో ఒక మహారాణి లాగా పెరుగుతుంది. ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవడం, కావలిసింది తినడం, అమ్మ చేస్తే తినడం, ఇష్టం వచ్చినట్లు ఉండడం.. ఇలా జీవితంలో అలవాటు పడిపోయిన ఒక మహిళ కొత్తగా పెళ్లి చేసుకుని తనకు తెలియని ప్రపంచంలోకి, మనుషుల మధ్యలోకి అడుగుపెట్టి సర్దుకుపోవడం అంటే కొంచెం కష్టమైన పనే.. అయితే పెళ్ళైన తరువాత మరో రిలేషన్‌షిప్‌ లోకి అడుగు పెడతాం. ఈ బంధాన్ని, రిలేషన్ ను గౌరవించి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అందరిమీద కోపగించుకోవడం చిరాకు పడడం మంచిది కాదు. ఇంట్లో అత్తతో గొడవలు పడడం సరి అయిన పద్ధతి కాదు. అందుకు సమయం, సహనం రెండూ కావాలి. మీకు వివాహమైన తరువాత మీకు మీ మీద నమ్మకం ఉంటుంది. నెమ్మదిగా మీ భర్త సపోర్ట్ కూడా తోడవుతుంది. మెట్టినిల్లు మీ ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. మీ విషయంలో మీ తల్లి తండ్రులు తలదించుకునేలా ప్రవర్తించకండి. మీ మెట్టినింట్లో మీరు ఎలా సర్దుకుపోవాలో తెలుసుకోండి.

మీ ఇన్ – లాస్ లతో మీకు అభిప్రాయ భేదం ఉన్నప్పుడు, లేదా మీకు నచ్చనిది వారు మీకు చెప్తున్నప్పుడు ముందు వినండి. వాళ్ళు పూర్తిగా వేరే జెనరేషన్ కి చెందిన వారు. అలాగే, వారు ఆలోచించే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. కొద్దిగా ఓపిక పట్టండి. జరిగిపోయిన గొడవల గురించి మరిచిపోండి. దాని గురిచే ఆలోచిస్తూ కూర్చోవడం కూడా మంచిది కాదు. ఏ సమస్యనైనా అర్ధం చేసుకుని సాల్వ్ చేయండి. ఏమైనా బాధపడినా అక్కడికక్కడే వదిలేయండి, మనసులో పెట్టుకోవడం వల్ల లాభం ఏం లేదు. ఎలాంటి బంధం అయినా సరే హ్యాపీగా ఉండాలంటే ఓపిక అవసరం. వాళ్ళ వైపు నించుని ఆలోచించి వాళ్ళు అలా ఎందుకన్నారో తెలుసుకోగలిగితే జీవితం ప్రశాంతం గా ఉంటుంది. అలాగే భార్యా భర్తల బంధం ఎంతో విలువైనది. ఇందులో మీరు అవకాశమిస్తే తప్ప ఇంకొకరు తల దూర్చలేరు.

ఈ బంధంలో ఇద్దరూ చెరొక మైండ్ సెట్ తో, చెరొక పెంపకంతో వచ్చి ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి బతకడం మొదలుపెట్టినప్పుడు తేడాలు రావడం అత్యంత సహజమైన విషయం. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. అభద్రతా భావంలోకి జారిపోకూడదు, అలాగే భయపడకూడదు. ఈ బంధంలో మీకు సపోర్ట్ ని ఇచ్చేదీ, ఇవ్వాల్సిందీ మీ పార్ట్నర్ మాత్రమే. అందుకని, మీ పార్ట్నర్ కీ మీకూ మధ్య నమ్మకం, గౌరవం, ప్రేమాభిమానాలు ఉండేలా చూసుకోండి. ఒకసారి మీతో ఇలాంటి కనెక్షన్ ఏర్పడ్డాక మీ పార్ట్నర్ మీ తరఫున నిలబడి తన పేరెంట్స్ తో మాట్లాడే ధైర్యం వస్తుంది. కానీ, ప్రస్తుతం మీరు ఈ కొత్త బంధం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎలాంటి సమస్య అయినా త్వరగా సాల్వ్ చేసుకోవడమే మంచిది. చీటికీ మాటికీ ప్రతి చిన్నదానికి గొడవలు పడుతుంటే మీ భాగస్వామికి కూడా మీ మీద అసహనం వచ్చే అవకాశం ఉంది. అది మీ ఇల్లు.. మీ ఇంటిని మీరే సరిదిద్దుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news