తెలంగాణాలో ఎన్నికలు గెలవడానికి పోటీలో ఉన్న ముఖ్యమైన పార్టీలలో కాంగ్రెస్, బీజేపీ మరియు BRS లు ఉన్నాయి. ఇంకా మిగిలిన స్థానిక చిన్న పార్టీలు వీరితో పొత్తులు పెట్టుకుని వారి గెలుపుకోసం కృషి చేస్తున్నాయి. కాగా ప్రచార కార్యక్రమాలు చాలా రసాభాసగా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో ఒక వింత ఘటన జరిగింది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర గెలుపు కోసం కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఇంతలో సడెన్ గా ఒక వ్యక్తి స్టేజ్ మీదకు రాగానే అందరూ అతన్ని చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అతన్ని చూస్తే సగం గుండు మరియు సగం మీసం తోనే ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
అయితే ఇతను స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర ఎన్నికలో గెలిచే వరకు ఇలాగే తిరుగుతానని శపధం చేయడం విశేషం.