సాయంత్రం కాంగ్రెస్‌ సీఈసీ భేటీ..బీహార్‌ ఎన్నికలపై చర్చ.

-

బీహార్‌ ఎన్నికల్లో అనుసరించవల్సిన వ్యూహాంపై చర్చించడానికి రోజు సాయంత్రం కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది..సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధ్యక్షురాలి నివాసంలో భేటీ జరగనుంది..ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల స్టాటజీతో పాటు అభ్యర్థుల ఎంపికపై కీలకంగా చర్చ జరగనుంది..ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తు అధికార పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూకుడు పెంచాయి..ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న సీఎం నితీశ్ కుమార్ ఈ రోజు నుంచి అధికారంగా తన ప్రచారం మొదలు పెట్టనున్నారు.
మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఎవరేవరికి ఎలాంటి బాధ్యతలు అప్పజేప్పాలనే వ్యూహాలు చర్చించనుంది కాంగ్రెస్..ఇప్పటికే స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ఈసీ అందజేసింది..ఈ లిస్ట్ లో ప్రముఖుల పేర్లు ఉన్నప్పటికీ వారికి ఇప్పటి వరకూ ఎటువంటి అధికారికమైన బాధ్యతలు అప్పగించలేదు..ఈ రోజు జరిగే సిఇసి సమావేశంలో దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..ఏ రోజులో ఎవరు ఎక్కడ ప్రచారంలో పాల్గొనాలి అనేది కూడా సాయంత్రం భేటీలో క్లారిటీ రావచ్చు..
యూపీలో జరిగిన హత్రాస్ ఘటనపై సీరియస్‌గా నిరసన కార్యక్రమాలు చేపట్టిన రాహుల్-ప్రియాంక గాంధీలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి..మహారాష్ట్రలో ఎన్సీనీ, శివసేన కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ బీహార్‌ ఎన్నికల్లో కూడా పొత్తులు పెట్టుకోవాలా? పెట్టుకుంటే ఎటువంటి పోత్తులు పెట్టుకోవాలి? వద్దా? అనే అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి..మహిళా సమస్యలపై మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రియాంకకు బీహార్‌ ఎన్నికలు ఒక పరీక్ష కానుంది..వచ్చే ఏడాది జరిగే కర్నాటక, తమిళనాడు ఎన్నికలపై బీహార్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి.
.

Read more RELATED
Recommended to you

Exit mobile version