బీజేపీ పై కాంగ్రెస్ చీఫ్ ప్రశంసలు..!

-

హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది ఇటువంటి టైం లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ బీజేపీ మీద ప్రశంసలు కురిపించారు. బిజెపి పార్టీ పనితీరు బాగుందని అన్నారు. హిమాచల్ లో రాజకీయ సంక్షోభం ముగిసిందని సుఖ్వీందర్ సీఎం గా కొనసాగుతారని డీకే శివకుమార్ అన్నారు. దీంతో రాజకీయ సంక్షోభం ముగిసిందని అంతా భావించారు.

అయితే ఈ టైంలో బిజెపి పై ప్రశంసలు కురిపించి షాక్ ఇచ్చారు ప్రతిభా. కాంగ్రెస్ కంటే మెరుగ్గా బీజేపీ పని చేస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని చెప్పారు పార్టీలో అంతర్గత వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇంకా పనులు చేయాలి అని అన్నారు పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని సీఎం కి ఎప్పటినుండో చెప్తున్నాను అని అన్నారు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉన్నట్లు చెప్పారు అయితే వాటిని పరిష్కరించాలని అన్నారు మోడీ ఆదేశాల ప్రకారం బిజెపి పని చేస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news