అసెంబ్లీలో నీలి చిత్రాలు చూస్తూ.. ఛీ ఛీ !

-

బెంగళూరు: ప్ర‌జాస్వామ్యంలో అత్యున్న‌త‌మైన‌విగా భావించే చ‌ట్ట‌స‌భ‌ల్లో కొంద‌రు ప్ర‌జానాయ‌కులు చేసే చేష్ట‌లు వాటి ప్ర‌తిష్ట‌ను దిగ‌జారుస్తున్నాయి. ప్ర‌జా స‌మ‌స్య‌పై పోరాడాల్సిన చోట ఓ ఎమ్మెల్సీ తాజాగా చేయ‌రాని ప‌ని చేయ‌డంతో ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా అది చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్న‌ది. వివ‌రాల్లోకెళ్తే.. క‌ర్నాట‌క అసెంబ్లీలో శాస‌న మండ‌లి స‌భ్యుడు స‌మావేశాలు జ‌రుగుతుండ‌గానే నీలి చిత్రాలు (పోర్న్ వీడియోలు) చూస్తూ కెమెరాకు చిక్కాడు ఓ ఎమ్మెల్సీ.

తాజాగా అసెంబ్లీ, శాస‌న మండ‌లిలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 11 బిల్లుల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్ర‌కాశ్ రాథోడ్ పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనిపై ప్ర‌జ‌ల‌తో పాటు ఇత‌ర పార్టీలు కూడా గ‌రంగ‌రం అవుతున్నాయి. వెంట‌నే ఆయ‌న రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే, త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను రాథోడ్ ఖండిచ‌డం గ‌మ‌నార్హం. అస‌భ్య దృశ్య‌లు చూడ‌లేద‌నీ, త‌న ఫోన్ స్టోరేజీ నిండిపోయింద‌నీ, తాను ఓ ఫైల్ డౌన్ లోడ్ చేయాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఫోన్ వాడానంటూ చెప్పుకొచ్చారు. పోర్న్ చూస్తున్నానన్న దాంట్లో నిజం లేదంటూ చెప్పుకోచ్చారు. కాగా, ఇదివ‌ర‌కు ఇక్క‌డే ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్క‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news