ఇవాల్టి నుంచి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు

-

 

నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ఈ 85 వ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ “స్టీరింగ్ కమిటీ”సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసిసి సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆరు తీర్మానాలను ఖరారు చేయనున్న “స్టీరింగ్ కమిటీ”…ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేయనున్నారు.

 

“కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” (సిడబ్ల్యుసి) కి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న “స్టీరింగ్ కమిటీ” నిర్ణయిస్తుంది…25వ తేదీన ( శనివారం) ఉదయం 9:30 గంటలకు “పార్టీ జెండా” వందనం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షోపన్యాసం ఉండనుంది. ఫిబ్రవరి 25 వ తేదీన మూడు తీర్మానాలు–రాజకీయ, ఆర్ధిక, విదేశీ విధానం–ఏఐసిసి సమావేశంలో ప్రవేశ పెట్టడం, చర్చించి, ఆమోదించడం.

పిబ్రవరి 25వ తేదీన ( శనివారం) మధ్యాహ్నం సోనియా గాంధీ ఉపన్యాసం ఉంటుంది.  ఫిబ్రవరి 26 వ తేదీన ( ఆదివారం) మరో మూడు తీర్మానాలు–యువత, నిరుద్యోగం, సామాజిక న్యాయం-సాధికారత, వ్యవసాయరంగ సమస్యలు—ఏఐసిసి సమావేశంలో ప్రవేశ పెట్టడం, చర్చించి, ఆమోదించడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news