తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికై కేసీఆర్ సర్కార్ ధరణి పోర్టల్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అయినప్పటికీ చాలా వరకు భూ సమస్యలు తీరడంలేదనని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిర్ణయం తీసుకుంది. భూసస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావంటూ కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా భూ సమస్యలు ఉన్నావారు తమకు ఫోన్ చేయాలని కాంగ్రెస్ ఓ టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేసింది.
సమస్యలు ఎదురుకుంటున్న వారు 04024615604 లేదా 24601254 నంబర్ లకు ఫోన్ చేసి తెలపాలని పేర్కొంది. ఫోన్ చేసి తమకు వివరాలు తెలిపితే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఉంటే దానికి కూడా న్యాయపరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం తో రైతులకు దగ్గరయ్యే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.