ప్రస్తుతం తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు మంటలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా సీఎం బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు , విమర్శలు చేశారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని .. కుండబద్దలు కొట్టారు. అయితే ప్రస్తుతం వానాకాలం కూడా పంట ధాన్యం సేకరణ నెమ్మదిగా సాగుతోంది. దీంతో రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. వర్షం కురవడంతో ఆరోబోసిన ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హై కోర్ట్ లో పిల్ దాఖలైంది. కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని న్యాయ విద్యార్థి బొమ్మన గారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని కోర్ట్ ద్రుష్టికి తీసుకువచ్చారు పిటీషనర్. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని లాయర అభినవ్ పేర్కొన్నాడు. కనీస మద్దతు ధరతో వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.