లగచర్లలో అధికారులపై దాడిలో కుట్రకోణం : ఎస్పీ నారాయణ రెడ్డి

-

ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ చేసేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో సోమవారం అర్థరాత్రి పోలీసులు 28 మంది గ్రామస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ సందర్భంగా వికారాబాద్ ఎస్పీ నారాయణ‌ రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్రకోణం ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. బోగమోని సురేష్‌ అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారన్నారు. అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులతో దాడి చేయించారన్నారు. సురేష్‌ బీఆర్ఎస్‌కి చెందిన కార్యకర్తగా గుర్తించామని, అతడి స్వస్థలం హైదరాబాద్‌‌లోని మణికొండ అని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్తులను సురేశ్ రెచ్చగొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news