తనను మంత్రి పదవి నుంచి తప్పించాలని టీడీపీ కుట్ర పన్నుతుందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అందుకే సంబంధం లేని క్యాసినో వివాదాన్ని తనపై తీసుకువస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్టు అనంతరం మంత్రి కొడాలి నాని తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కాగ ఒక మంత్రిని చంపుతా అని బెదిరిస్తే.. చట్టం చూస్తు ఊరుకోదని అన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. కాగ బుద్దా వెంకన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.
లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే క్యాసినో పై తన పై అనవరంగా ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. తన కే కన్వెన్షన్ లో క్యాసినో జరిగితే.. ఆత్మ హత్య చేసుకుంటా అనే మాటాలకు ఇంకా కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. అలాగే అసలు క్యాసినో ఎక్కడ జరిగింది.. అసలు జరిగిందా అనే టీడీపీ నాయకులు అనుకుంటున్నారని అన్నారు. ఒకరు గుడివాడ అని మరొకరు కె కన్వెన్షన్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే 2024 వరకు టీడీపీని, చంద్ర బాబును ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భూ స్థాపితం చేస్తారని జోస్యం చేప్పారు.