సౌత్ లోనే అతిపెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ హైదరాబాద్ లో ప్రారంభం

-

హైదరాబాద్ లోని జీడిమెట్లలో శిధిల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ని తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 15 ఎకరాల్లో నెలకొల్పబడిన ఈ రీసైక్లింగ్ ప్లాంట్ కి రోజుకి 500 టన్నుల శిధిల వ్యర్థాలను రీసైకిల్ చేసే సత్తా ఉంది. ఈ శిధిల వ్యర్థాల తరలింపు కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. 1800 1200 76 69 ఈ నెంబర్ కి కాల్ చేసి శిధిల వ్యర్థాలు ఉన్నాయని చెబితే కార్మికులే వచ్చి తీసుకు వెళ్ళేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాదు నగర వ్యాప్తంగా రోజు రెండు వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా చెత్త నుంచి సంపద సృష్టించడం మంచి కాన్సెప్ట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది దక్షిణ భారతదేశంలోని బెస్ట్ అలాగే పెద్ద ప్లాంట్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యర్థాలు అనేవి ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దని కోరిన ఆయన ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news