వేసవి లో డయాబెటిస్ ని… ఇలా సులభంగా కంట్రోల్ చెయ్యండి..!

-

ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో షుగర్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. వేసవికాలంలో కొన్ని రకాల టిప్స్ ని అనుసరిస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఈరోజు అద్భుతమైన చిట్కాలని పంచుకోవడం జరిగింది మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూసేద్దాం.

వేసవిలో డయాబెటిస్ ఉన్నవాళ్లు అధిక ఉష్ణోగ్రత కారణంగా అలసట ఎండ దెబ్బ వంటి వాటికి గురవుతూ ఉంటారు. రక్తనాళాలు నరాలని దెబ్బతీస్తుంది పైగా చెమట గ్రందులపై కూడా ప్రభావం చూపిస్తుంది. అధిక చెక్కర స్థాయిల వలన మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది.

దీంతో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎక్కువ నీటిని కోల్పోతూ ఉంటారు. డిహైడ్రేషన్ సమస్య కూడా కలగొచ్చు. టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఇన్సులిన్ మోతాదుని నియంత్రించడానికి చక్కెర స్థాయిలని మరింత తరచుగా చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది దాంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

పండ్లను తీసుకోండి:

వేసవి కాలంలో తాజా పండ్లను తీసుకోండి. జ్యూసులు డ్రింకులు వంటి వాటిని తీసుకోవద్దు. ఒకవేళ కనుక మీరు పండ్ల రసాలు తాగాలనుకుంటే లిమిట్ గానే తీసుకోండి. ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

హైడ్రేట్ గా ఉండండి:

హైడ్రేట్ గా ఉండడానికి నీళ్ళని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. నీళ్ళని బాగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు కూడా. నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవచ్చు.

ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోండి:

బ్రెడ్, తృణధాన్యాలు, గింజలు, పండ్లు,గుమ్మడికాయ, క్యారెట్, టొమాటో వంటి వాటిని తీసుకుంటూ ఉండండి.

శారీరకంగా చురుకుగా ఉండటం మంచిది:

ఉదయం సాయంత్రం ఒక అరగంట సేపు నడవడం వంటివి చేస్తే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇలా వేసవి కాలంలో డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఈ చిట్కాలని అనుసరిస్తే తప్పక ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version