తిరుమల భక్తులకు అలర్ట్.. ఉగాది సందర్భంగా ఇవాళ, రేపు బ్రేక్ దర్శనాలు రద్దు!

-

 

తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ పఠనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు నిర్వహిస్తారు.

ఆరోజు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవాన్ని తీతీదే రద్దు చేసింది. ఇవాళ, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సోమవారం, మంగళవారం విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆదివారం దాదాపు 24 గంటలు పట్టింది. స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మధరావు ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదశీర్వచనం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version