గుడ్ న్యూస్ : మ‌రోసారి భారీగా త‌గ్గ‌నున్న వంట నూనె ధ‌ర‌లు

-

సామాన్యుల‌కు పెను భారంగా మారుతున్న అధిక ధ‌ర‌లు ఇప్పుడు కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌గ్గిన వంట నూనె ధ‌ర‌లు తాజా గా మ‌రోసారి త‌గ్గాయి. ప్ర‌తి కిలో గ్రాము వంట నూనె ధ‌ర రూ. 20 త‌గ్గిన‌ట్టు కేంద్ర మంత్రుత్వ శాఖ తెలిపింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో క‌మోడిటీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అయినా.. వంట నూనె ధ‌ర‌లు త‌గ్గించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. కాగ గ‌త ఏడాది కరోనా కాలంలో భారీగా పెరిగిన వంట నూనె ధ‌ర‌లు.. గ‌త ఏడాది అక్టోబ‌ర్ నుంచి త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గించ‌డం, నకిలీ నిల్వ‌ల‌ను అరిక‌ట్ట‌డం వంటి కఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ధ‌ర‌లు అదుపులోకి వ‌స్తున్నాయి. త‌గ్గిన ధ‌ర‌లతో వేరు శ‌న‌గ నూనె ధ‌ర కిలో గ్రాము కు రూ. 180 ఉంటుంది. అలాగే మస్ట‌ర్డ్ వంట నూనె ధ‌ర రూ. 184.59 గా ఉంటుంది. అలాగే సోయా నూనె ధ‌ర రూ. 148.85 అలాగే పామాయిల్ ధ‌ర రూ. 162. 4 ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version