సామాన్యులకు రిలీఫ్… నూనె ధరల్లో మార్పులు…..!

-

వంట నూనె ధరలు బాగా పెరిగిపోవడం తో సామాన్యులకు మరెంత కష్టం అవుతోంది అన్న సంగతి తెలిసిందే. అయ్యితే ఈ వంట నూనె ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశముంది అని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే…. ఈ ధరలు కనుక తగ్గితే సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది.

ఈ సంవత్సరం మొత్తం లో ఇప్పటీ వంట నూనె ధర రూ.55కు పైగా పెరిగింది. ఇప్పుడు లీటరు పామ్ ఆయిల్ ధర రూ.150కు చేరింది. నిజంగా ఇది సామాన్యులని ఇబ్బందుల్లోకి పెట్టేసింది. బాగా ధరలు పెరిగి పోవడం వారికీ ఇబ్బంది అనే చెప్పాలి.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు వంట నూనె ధర తగ్గే అవకాశం కనపడుతున్నట్టు తెలుస్తోంది. కాండ్లా, ముంద్రా పోర్ట్‌ల లో నూనె స్టాక్ భారీగా నిలిచి పోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేక పోవడం వల్ల పోర్ట్‌లలో అది అలానే చిక్కుకుంది.

ఈ స్టాక్‌కు ఇప్పుడు క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. దీనితో ధరలు తగ్గే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రతి సంవత్సరం భారత్ వంట నూనె దిగుమతుల కోసం రూ.75 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. వంట నూనె ధర ఇప్పుడు రూ.150కు చేరింది. ఇప్పుడు తగ్గితే సామాన్యులకి రిలీఫ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news