రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలీన స్టేజీ

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచారం చివరిదశకు చేరుకుంది. మరో 3 రోజుల్లో పూర్తిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రతిపక్ష ఇండియా కూటమి బీహార్, పాట్నాలోని పాలిగంజ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ,తేజస్వి యాదవ్, మీసా భారతీ సహా ఇతర ముఖ్యమైన నేతలు చేరుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

స్టేజ్ కూలిన సమయంలో రాహుల్ గాంధీ మీసా భారతీ చేయి పట్టుకుని ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది రాహుల్ వద్దకు చేరుకుని కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారిని వారించి తాను క్షేమంగా ఉన్నట్టు ప్రజలవైపు తిరిగి అభివాదం చేస్తూ కిందకు వెళ్లారు. అంతేకాకుండా అక్కడే ఉన్న మరికొందరు నేతలు వేదికపైనే ఉన్న తేజస్వి యాదవ్‌ను పట్టుకున్నారు. కాగా, ఇప్పటివరకు ఆరు దశలలో ఎన్నికలు జరగగా చివరి దశ ఎన్నికలు జూన్ ఒకటో తారీకు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news