సిగరెట్ తాగితే కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ధూమ పానం కీలక పాత్ర పోషిస్తుందని, ధూమ పానం అలవాటు ఉన్న వారికి కరోనా సోకే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. చైనా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసారు. మిగతా వారితో పోలిస్తే ధూమపానం చేసేవారిలో వైరస్ సోకే అవకాశం 14 రెట్లు ఎక్కువని వాళ్ళు స్పష్టం చేసారు.
కరోనా సోకిన వేల మందిపై ఈ పరిశోధన చేసారు వాళ్ళు. పొగతాగే వారిలో వ్యాధినిరోధక శక్తి క్రమంగా తగ్గడం తో వైరస్ వ్యాపించే అవకాశాలు మిగతావారితో పోలిస్తే చాలా ఎక్కువని వాళ్ళు గుర్తించారు. శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్ పొరను ఉత్పత్తి చేస్తాయని, కాని పొగతాగేవారిలో ఈ మ్యూకస్ పొర మందంగా ఉంటుందని… దీనితో వ్యర్థాలను బయటికి పంపేందుకు ఊపిరితిత్తులు చాలా కష్టపడతాయని,
ఇటీవల ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దక్కన్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఒక సిగరెట్ ని ఇద్దరు ముగ్గురు పంచుకుని తాగడంతో కరోనా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని టాటా మెమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ చతుర్వేది ఇటీవల మాట్లాడుతూ హెచ్చరించారు. ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు అవసరం లేకుండా బయటకు రావొద్దు అని హెచ్చరిస్తున్నారు.