కరోనా అలెర్ట్; హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం…!

-

హైదరాబాద్ కి కరోనా రావడం ఏమో గాని అన్ని వ్యవస్థలు ఇప్పుడు భయపడిపోతున్నాయి. అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ ఎక్కడా కూడా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పడుతుంది తెలంగాణా సర్కార్. సికింద్రాబాద్ కి చెందిన ఒక ఐటి ఉద్యోగికి కరోనా వచ్చిన నేపధ్యంలో ఆయన నివాసం ఉండే మహేంద్ర హిల్స్ చుట్టూ సానిటేషన్ చేసారు అధికారులు. వ్యాపించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా తన ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోస౦ తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, కౌన్సెలింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే దానిపై సలహాలు సూచనలు ఇచ్చారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో శుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్వహణ వేళలు పూర్తయ్యాక ఎవరూ లేని సమయంలో శుభ్రం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

మెట్రో స్టేషన్లు, రైళ్ల కోచ్‌లు, ఎస్కలేటర్స్‌ని శానిటైజర్స్‌తో క్లీన్ చేయాలని, కరోనావైరస్‌పై తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, త్వరలోనే మెట్రలో కరోనా వైరస్‌పై డిస్‌ప్లేలు ఏర్పాటు చేయడంతో పాటు అనౌన్స్‌మెట్ ఇస్తామని, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు వివరించారు. అటు సిబ్బంది కూడా వ్యక్తిగత భద్రత తప్పనిసరిగా తీసుకోవాలని, విధులకు అదే విధంగా హాజరు కావాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news