బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అలజడి

ఇంద్రకీలాద్రి పై కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 52 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందారు. జమలమ్మ మృతితొ ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇవాళ ఇద్దరు అర్చకులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కోవిడ్ తో అర్చకుడు మృతి చెందగా మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా ఉంది.

ఇంద్రకీలాద్రి పై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 నిముషాల నుంచి రాత్రి 7. 30 నిముషాల వరకు దుర్గమ్మ దర్శనం ఉంటుందని తెలిపారు. అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలతో పాటు పంచహారతులను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో విధులు నిర్వహించాలంటేనే అర్చకులు, ఉద్యోగులు భయపడుతున్నారు.