విద్యార్ధులకి గుడ్ న్యూస్..ఈసారి సులువుగానే స్కాలర్ షిప్స్!

-

ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే నిజంగా ఇది మంచి శుభవార్త. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగే పని అక్కర్లేదు. ఎంతో సులువుగా మీరు ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఫీజులు రూపాయలు లక్షల్లో ఉన్నాయి. దీంతో సామాన్యులకి చదువు అందని దుస్థితి ఏర్పడింది. అయితే మధ్య తరగతికి చెందిన పిల్లలు భారీగా నష్టపోతున్నారు.

students image

ఇదిలా ఉండగా పిల్లలు ఉన్నత చదువు కోసం చాలా మంది ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. మీరు బ్యాంకుల చుట్టూ తిరిగే కష్టం ఇప్పుడు ఏ మాత్రము అవసరం లేదు. హై ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్ళవలసిన పనే లేదు. అయితే దీని కోసం మీరు ఏం చేయాలంటే…? కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. దీని ద్వారా మీరు సులభంగా ఎడ్యుకేషన్ లోన్ ని పొందవచ్చు.

www.vidyalakshmi.co.in ఈ వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ పోర్టల్ లో దాదాపు 36 బ్యాంకులు వరకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అందువల్ల మీకు నచ్చిన బ్యాంకు నుంచి ఎడ్యుకేషన్ లోన్ మీరు సులువుగా పొందవచ్చు. అన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఒకే చోట మీకు అందుబాటులో ఉంటాయి. NSDL ఈ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే మీరు కనుక ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళి లాగ్ ఇన్ అవ్వాలి. తర్వాత మీకు ఒక ఫామ్ కనిపిస్తుంది. ఆ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత లోన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇందులో కేవలం లోన్ మాత్రమే కాకుండా స్కాలర్షిప్ కోసం కూడా ఈ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version