భారత్‌లో కరోనా స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఇంతకుముందున్న తీవ్రత ఇప్పుడు నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. నిన్న ఒక్కరోజే 4,369 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ సోకి 20 మంది మరణించారు. ఒక్కరోజులో 5,178 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్‌లో మొత్తం కేసులు 4,45,04,949 నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి 5,28,185 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో46,347 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 4,39,30,417 రికవరీ కేసులున్నట్లు తెలిపాయి.
దేశంలో సోమవారం 21,67,644 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 215.47 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,50,468 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.