ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ పెరిగిన కరోనా…!

-

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా చుక్కలు చూపిస్తుంది. ప్రతీ రోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. అక్కడ మంగళవారం ఒక్క రోజే 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే… 24884 కేసులు రావడంతో… మొత్తం కేసుల సంఖ్య 1035240కి చేరింది. ఈ మధ్య కాలంలో ఏ దేశం లో కూడా ఇంత మంది చనిపోలేదు.

స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, కెనడా వంటి దేశాల్లో కరోనా తగ్గుతూ వస్తుంటే… బ్రిటన్, టర్కీ, రష్యా, బ్రెజిల్, పెరు వంటి దేశాల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్, టర్కీ, రష్యా, బ్రెజిల్, పెరు వంటి దేశాల్లో మంగళవారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 75563 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య. 3135509కి చేరింది. అలాగే… మంగళవారం 6297 మంది చనిపోయారు.

మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణా లో కరోనా వైరస్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరోనా వైరస్ తీవ్ర౦గా ఉంది. మరణాలు పెరగకపోయినా ప్రతీ రోజు 70 మందికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గినా మళ్ళీ ఒక్కసారిగా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news