చైనాలో మరోసారి కరోనా మంటలు.. ప్రభుత్వం ఏం చేస్తుందంటే..!

-

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఆ తర్వాత ముఖం పట్టింది అన్న విషయం తెలిసిందే. క్రమక్రమంగా చైనా కరోనా వైరస్ రహిత దేశంగా మారింది. కానీ ప్రస్తుతం మరోసారి చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నట్లు తెలుస్తుంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రణకు మరోసారి విజృంభించ కుండా అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ముఖ్యంగా చైనాలో అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్టులో ఒకటైనప్పుడు పుడాన్గ్ ఎయిర్పోర్టులో విమాన సేవలను పూర్తిగా రద్దు చేస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అతి తక్కువ కేసులు నమోదు అయినప్పటికీ కూడా విమానాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది చైనా ప్రభుత్వం. ఇటీవల షాంగై ప్రాంతంలో ఏడు కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా అక్కడ పనిచేసే వేలాది మంది సిబ్బంది కూడా ప్రస్తుతం విధిగా కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news