కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలోని పలు రాష్ట్రాల్లో వందలమంది కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా కరోనా మొదటి కేసు నమోదు అయిన వూహాన్ నగరం లో గతంలో కంటే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో చైనా మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఒక దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా రష్యా జర్మనీ లో కూడా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి.
ప్రతిరోజు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దాంతో రష్యాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నారు. మాస్క్ లను తప్పకుండా ధరించాలని కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక టెస్టు ల సంఖ్యను పెంచడంతోపాటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.