వజ్రాల మాస్కులు..వామ్మో డిమాండ్‌ మామూలుగా లేదు…!

-

కరోనా వైరస్ కేవలం మనుషులకి అనారోగ్యం తీసుకు రావడం, ఎన్నో మరణాలకి కారణం అవ్వడం అని మాత్రమే తెలుసు. కానీ కరోనా కొత్త ఆభరణాలను కూడా తీసుకొచ్చింది. దీనికి డిమాండ్ కూడా ఎక్కువే. అయితే అసలు ఏం జరుగుతోంది? ఏమంటున్నారు అని అనుకోకండి ఇది నిజమే మరి ఈ వింత గురించి మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

diamond masks
diamond masks

కరోనా వల్ల ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించడం చేస్తున్నారు. సాధారణ మాస్కులు ధరించడం కంటే వివిధ రకాల ఫ్యాషన్ మాస్కులు ధరించడం చూస్తున్నాం. క్లాత్ తో తయారు చేసిన మాస్కులు లేదా వివిధ రకాల వాటితో మాస్కులు తయారుచేయడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు బాగా హల్ చల్ అవుతున్నాయి వజ్రాల మాస్కులు. మొన్నటికి మొన్న మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బంగారంతో చేసిన మాస్క్ ధరించాడు. ఇది వైరల్ అయ్యింది.

అయితే ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేయడంతో బయటకు వచ్చే వ్యక్తులు వివిధ రకాల మస్క్స్ పెట్టుకుని కనిపిస్తున్నారు. రంగురంగుల మాస్కులు రంగుల డిజైన్ మాస్కులు ఒక ఎత్తయితే ఈ వజ్రాల మాస్క్ మరొక ఎత్తు. గుజరాత్లోని సూరత్ నగరం వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు. కరోనా కారణంగా వజ్రాల వ్యాపారం కూడా దెబ్బతిన్నది. అయితే విభిన్నంగా వినూత్నంగా ఆలోచించి ఈ వ్యాపారులు సరికొత్త మాస్క్ లని తయారు చేసి అమ్ముతున్నారు.

అయితే వీళ్ళు ఈ మాస్క్ లని వజ్రాలతో తయారు చేసి అమ్మడం నిజంగా ఆశ్చర్యమే. వీటి ధర లక్షల్లో ఉంది వజ్రాలతో పొదిగిన మాస్కులు ఆకట్టుకోవడం తో అక్కడ అమ్మాయిలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారట. ఎంతోమంది అక్కడికెళ్లి ఆర్డర్లు ఇస్తున్నారట. ఈ మాస్క్ డిమాండ్ బాగా పెరిగిపోయిందని అక్కడ ఉన్న వ్యాపారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news