బ్రేకింగ్‌: కాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో 300 మంది ఉగ్ర‌వాదులు.. చొర‌బాటుకు సిద్ధం..

-

కాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు సుమారుగా 300 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు సిద్ధంగా ఉన్నార‌ని భార‌త ఆర్మీ వెల్ల‌డించింది. జ‌మ్మూ కాశ్మీర్‌లోని భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దు రేఖ ఎల్‌వోసీ వ‌ద్ద నౌగం సెక్టార్ ప్రాంతంలో ఉన్న లాంచ్ ప్యాడ్ల వ‌ద్ద పెద్ద ఎత్తున ఉగ్ర‌వాదులు న‌క్కి ఉన్నార‌ని, వారు ఏ క్ష‌ణంలో అయినా భార‌త్‌లోకి చొర‌బ‌డ‌వ‌చ్చ‌ని ఆర్మీ తెలిపింది. అదే ప్రాంతంలో ఆర్మీ ఇద్ద‌రు టెర్ర‌రిస్టుల‌ను మ‌ట్టుబెట్ట‌గా.. ఆ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే ఆర్మీ ఈ విష‌యాన్ని తెలిపింది.

about 300 terrorists waiting at india pakisthan border to infiltrate into india

ఉత్త‌ర కాశ్మీర్‌లోని నౌగం సెక్టార్‌, కుప్వారా వ‌ద్ద ఇద్ద‌రు టెర్ర‌రిస్టుల‌ను భార‌త సైనికులు హ‌త‌మ‌ర్చారు. ఆ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు సంచ‌రిస్తున్నార‌నే స‌మాచారం మేర‌కు భార‌త ఆర్మీ అక్క‌డ దాడి చేసింది. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదుల‌కు, సైనికుల‌కు కాల్పులు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ వీరేంద్ర వాత్స్ మాట్లాడుతూ.. భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దు వ‌ద్ద 250 నుంచి 300 మంది వ‌ర‌కు టెర్ర‌రిస్టులు ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని.. వారు ఏ క్షణంలో అయినా భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌వ‌చ్చ‌ని అన్నారు.

కాగా ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన ఘ‌ట‌న‌లో భార‌త ఆర్మీ వారి నుంచి రెండు ఏకే అజువ‌ల్ట్ రైఫిల్స్‌, వాటికి చెందిన 12 ఫుల్లీ లోడెడ్ మ్యాగ‌జైన్స్‌, ఒక పిస్ట‌ల్‌, కొన్ని గ్రెనేడ్లు, బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ ఉగ్ర‌వాదుల వ‌ద్ద రూ.1.50 ల‌క్ష‌ల విలువ చేసే ఇండియా, పాకిస్థాన్ క‌రెన్సీ కూడా ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆ ప్రాంతంలో ప్ర‌స్తుతం సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆర్మీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news