దేశంలో కరోనా పంజా ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట పట్టాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి ఇక కేరళలో ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్నా.. కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళలో ఈ నెల8 నుంచి 16 వరకు కంప్లీట్ లాక్‌డౌన్ పెడుతున్నట్టు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ పెట్టక తప్పట్లేదని స్పష్టం చేశారు. కేరళలో నిన్న ఒక్కరోజే 42వేల కేసులు నమోదయ్యాయని చెప్పారు. రోజువారీ కేసుల్లో దేశంలోనే మొదటి నాలుగు రాష్ట్రాల్లో కేరళ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు.