వావ్; రోజా చేస్తున్న సాయం ఏంటో తెలుసా…?

53

కరోనా వైరస్ దెబ్బ సినీ పరిశ్రమ మీద గట్టిగా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆగిపోవడమే కాకుండా సినిమా విడుదల కూడా దాదాపుగా ఆగిపోయింది. పదుల సంఖ్యలో సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల ఆగిపోయాయి. దీనితో చాలా మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఎందరో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి కేకలతో వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

దీనితో ఇప్పుడు అందరూ కూడా సిని ప్రముఖులు… వారిని ఆదుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద కళాకారుల ఆకలి తీర్చడం కోసం 100 బియ్యం బస్తాలను అందజేసారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకుల వద్ద జోలె పట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద కళాకారుల కోసం విరాళాలు సేకరించాలని రోజా భావిస్తుంది.

రాజకీయాల్లో బిజీ గా ఉన్నా సరే రోజా మాత్రం ఎప్పటికప్పుడు సినిమా తో టచ్ లోనే ఉంటున్నారు. బుల్లి తెర మీద ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు టీవీ షోస్ ద్వారా ఆమె అభిమానులను పెంచుకున్నారు. ఇక ఆమె భర్త సెల్వమణి కూడా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ సౌత్ ఇండియాకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా పేద కళాకారుల కోసం సహాయం చెయ్యాలని భావిస్తున్నారు.