తెలుగు నేర్చుకుంటోన్న పాయల్…

82

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇళ్ళవద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు ఇంటి వద్దే ఉంటూ తమ తమ పనులు నేర్చుకుంటున్నారు. కొందరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. మరికొందరు ఇంటి వద్దే ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. అయితే తాను వీటన్నింటికీ దూరం అంటోంది పాయల్.

ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ భామకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తెలుగులో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఈ భామ ప్రయత్నిస్తోంది..

దీనిలో భాగంగానే ఇంటి వద్దనే ఉంటూ తెలుగు నేర్చుకుంటోంది. ఇంగ్లీష్ రాసిన పదాలకు తెలుగులో ట్రాన్స్ లేట్ చేసుకుని బట్టి పడుతోంది. తెలుగు నేర్చుకోవడం కోసం తను పడుతున్న కష్టాన్ని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.