ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ప్రతి రోజు 13 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక సోమవారం ఏకంగా 14 వేల మార్క్ ను కరోనా కేసులు అందుకున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్నా.. విద్యాసంస్థలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
అంతే కాకుండా పాఠశాలలో నిర్వహించే ఉదయం ప్రార్థనను నిలిపి వేయాలని విద్యా శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేసింది. ఉదయం నిర్వహించే ప్రార్థన సమయంలో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సూచించింది. అలాగే పిల్లలకు ప్రస్తుత సమయంలో ఎలాంటి ఆటలు నిర్వహించవద్దని తెలిపింది. అలాగే పిల్లలను గుంపులు గుంపులుగా ఉండ కుండా చూడాలని సూచించింది. అలాగే స్కూల్ ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని అధికారులను ఆదేశించింది.