బిగ్‌బాస్ 3 హోమ్‌ క్వారంటైన్‌.. టీమ్‌ టీమ్‌కి కరోనా ఎఫెక్ట్‌..

-

అస‌లే అది క‌రోనా మ‌హ‌మ్మారి.. కొంచెం ఏమ‌రుపాటుగా ఉంటే దొంగచాటుగా అది మ‌న‌పై దాడి చేస్తుంది. ఎప్పుడు ఎవ‌రి నుంచి ఎలా మ‌న‌కు క‌రోనా సోకుతుందో తెలియ‌దు. అది వ‌చ్చాక దాని ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డితే గానీ.. అది మ‌న‌కు సోకిన‌ట్లు కూడా తెలియ‌దు. ఈ క్ర‌మంలో క‌రోనా ప్ర‌స్తుతం కోర‌లు చాస్తోంది. దానికి పేద‌, ధ‌నిక, ఆడ‌, మ‌గ‌, పిల్లా పెద్దా అన్న తేడా లేదు. ఎవ‌రికి ప‌డితే వారికి వ్యాప్తి చెందుతోంది. ఇక ఇందుకు బుల్లి తెర న‌టులేమీ మిన‌హాయింపు కాదు. షూటింగ్‌ల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి బుల్లితెర‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇక తాజాగా ఈ కేసులు కూడా ఎక్కువ‌య్యాయి.

మ‌రోవైపు బిగ్‌బాస్ 3 టీం మొత్తానికి క‌రోనా ఎఫెక్ట్ బాగానే త‌గిలింది. ఆ షో కంటెస్టెంట్ల‌లో ఒక‌డైన టీవీ న‌టుడు ర‌వికృష్ణ‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే అత‌నితో టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించిన వారే కాదు, అత‌ని బిగ్‌బాస్ టీం మేట్స్ కూడా ప్ర‌స్తుతం కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇటీవ‌లే ర‌వికృష్ణ ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో బిగ్‌బాస్ 3 పార్టిసిపెంట్స్‌తో క‌లిసి ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. ఆ త‌రువాత ర‌వికృష్ణ‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో అత‌నితో ఆ ప్రోగ్రామ్‌లో న‌టించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు శివ‌జ్యోతి, అలీ రెజా, హిమ‌జ‌, అషు రెడ్డి, రాహుల్‌, రోహిణిలు కూడా ప్ర‌స్తుతం కరోనా టెస్టులు చేయించుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో వారంద‌రూ ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణ‌లో రోజు రోజుకీ ఓ వైపు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం.. మ‌రోవైపు చాప‌కింద నీరులా క‌రోనా అన్ని రంగాల్లో ప‌నిచేసేవారికి సోకుతుండ‌డంతో.. జ‌నాల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఇక సీరియ‌ల్ న‌టీన‌టులు, ఇత‌ర ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవారికి కూడా ప్ర‌స్తుతం క‌రోనా బెడ‌ద ప‌ట్టుకుంది. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్పుడు అదుపులోకి వ‌స్తుండో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version