కొడుకు మరణం.. కోడాలితో మామ వివాహం..!

-

వివాహం తర్వాత భర్త మరణిస్తే.. ఆ భార్య జీవితాంతం ఆ భర్త జ్ఞాపకాలతోనే బతికేస్తుంది. ఒకవేళ తక్కువ వయసు ఉంటే ఆమెకు మళ్ళీ పెళ్లి చేస్తారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ, అలా భర్తను కోల్పోయిన భార్యను ఆ భర్త తండ్రే పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా చూశారా.? ఇలాంటి వింత ఘటనే ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బిలాస్‌పూర్‌కు చెందిన గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్(22) దంపతులు. అయితే గౌతమ్ సింగ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆర్తి సింగ్ రెండు సంవత్సరాలుగా వితంతువుగా ఉంటూ గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్‌పుత్ సింగ్ సమక్షంలో బతుకుటుంది. అయితే రాజ్‌పుత్ క్షత్రియ మహాసభ సంప్రదాయం ప్రకారం.. గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్‌పుత్‌ ను ఆర్తిసింగ్ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించారు. మహిళల పునర్వివాహాన్ని వారి కమ్యూనిటీలో అనుమతిస్తారు. దీనికితోడు రెండేళ్లుగా అతడు ఆమెను చూసుకున్న తీరు నచ్చి.. ఆర్తి సింగ్ సైతం వివాహం చేసుకునేందుకు అంగీకరించింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో కొంతమంది పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version