ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు తప్పని గండం..భారీగా తగ్గిన భక్తులు…!

-

ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఉత్సవాలు ప్రారంభమైనా.. భక్తుల సందడి మాత్రం అంతగా కనిపించటం లేదు. ఏటా నవరాత్రులకు భక్తులతో కిటకిటలాడే అమ్మవారి ఆలయం…ఈసారి మాత్రం కళ తప్పినట్లే కనిపిస్తోంది. ఏటా ఈసమయానికి కిక్కిరిసిపోయే ఇంద్రకీలాద్రి.. ఈసారి బోసిపోతోంది. మరోవైపు, వస్తున్న కొద్దిపాటి భక్తులు ఆంక్షల మధ్యే అమ్మను దర్శించుకుంటున్నారు.

రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతిస్తూ పకడ్భందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కొండమీదకు వచ్చే భక్తులకు ధర్మల్ స్క్రినింగ్ చేసి… కరోన లక్షణాలు లేకపోతేనే అనుమతి ఇస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా ఆన్‌లైన్‌ టికెట్ తో పాటు ఐడీ ప్రూఫ్ ని వెంట తెచ్చుకోవాలి. అశేష భక్తకోటితో నిత్య పూజలందుకుంటున్న బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏటా అంగరంగవైభవంగా జరిగేవి. అయితే, కరోనా కారణంగా ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై ఆ శోభ కనిపించటం లేదు. దసరా సమయంలో భవానీ మాల ధరించేవారి కోసం కొండపై ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కడెక్కడి నుండో అమ్మవారికి ముడుపు తీసుకొస్తారు భవానీలు. కానీ ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై ఆ అవకాశం లేదని… మాల వేసుకునే వాళ్ళు దగ్గర్లో ఉన్న గురు భవానీలతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో కొండపై ఎక్కడా భవానీల జాడ కూడా కనిపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news